JC Prabhakar Reddy: రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar Reddy: వాహనాల కొనుగోళ్ల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డిని విచారిస్తున్న ఈడీ

Update: 2022-10-08 06:27 GMT

JC Prabhakar Reddy: రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. BS-3 లారీలను BS-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణలతో గతంలో ఈడీ హైదరాబాద్ , అనంతపురం, తాడిపత్రిలోని ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని.. ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. నిన్న 9 గంటలపాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ఇవాళ కూడా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. రెండో రోజు విచారణలో భాగంగా ఉదయం 10.15 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. భారత్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌)-3 ప్రమాణాలు కలిగిన లారీలను అక్రమంగా బీఎస్‌-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో గత జూన్‌లో ఈడీ బృందాలు హైదరాబాద్‌, అనంతపురం, తాడిపత్రిలోని ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. వాటిపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి శుక్రవారం వచ్చారు. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. నిన్న దాదాపు 8 గంటల పాటు జేసీని ప్రశ్నించారు. రెండో రోజు విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పడంతో.. సంబంధిత పత్రాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ మరోసారి ఈడీ కార్యాలయానికి వచ్చారు.

Full View
Tags:    

Similar News