జనసేనలో కీలక నియామకాలు.. మరో ఇద్దరికి పదవులు
నసేన పార్టీ మరో కీలక నియామకాలు చేపట్టింది. టీవీ చర్చల్లో పార్టీ గొంతుకను వినిపించడానికి గాను మరో ఇద్దరు..
జనసేన పార్టీ మరో కీలక నియామకాలు చేపట్టింది. టీవీ చర్చల్లో పార్టీ గొంతుకను వినిపించడానికి గాను మరో ఇద్దరు ప్రతినిధుల్ని ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించిన పేర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ మీడియాకు విడుదల చేశారు. విద్యా కోవిదుడు కోటమరాజు శరత్ కుమార్, పాత్రికేయుడు పి.వివేక్ బాబును ప్రతినిధులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ నియమించారని ఆయన పేర్కొన్నారు. ఇకనుంచి జనసేన తరఫున టీవీ చానెల్స్ చర్చా కార్యక్రమాల్లో వీరు కూడా పాల్గొంటారని అన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వివేక్ బాబు (40) బీటెక్ చదివి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. కొంత కాలం పాటు ఓ ప్రముఖ న్యూస్ చానల్‌కు రిపోర్టర్‌గా పని చేశారు.
అలాగే విజయవాడకు చెందిన శరత్ కుమార్ (42) ఎంటెక్, ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. పార్టీ స్థాపించిన మొదట్లో వీరు జనసేనలో చేశారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వీరి ఆసక్తిని గమనించిన పవన్ కళ్యాణ్ వీరిని మీడియా ప్రతినిధులుగా నియమించారు. ఇదిలావుంటే జనసేన తరఫున ఇప్పటికే శివకుమార్, బొలిశెట్టి సత్యనారాణ, సుందారపు విజయ్ కుమార్ మీడియా చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో కుసంపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా డిబేట్లలో చురుకుగా పాల్గొనేవారు.. అయితే ఆయన ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారని ఏపీ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది. దాంతో గత కొద్ది రోజులుగా డిబేట్లలో పాల్గొనడం లేదు.