తెలుగు రాష్ట్రాల ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..

ముస్లింలకి ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ప్రముఖులు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Update: 2020-05-25 08:05 GMT
Pawan Kalyan (File Photo)

ముస్లింలకి ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ప్రముఖులు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల ముస్లిం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

" ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసం అతి పవిత్రమైనది. దివ్య ఖురాన్ అవతరించిన మాసం. సత్య ,నిష్ఠ ,క్రమశిక్షణ, దానశీలత, దయ, ప్రిమాన్వీతాల సారమే రంజాన్ సారాంశం.. ఇస్లాంను ఆచరించేవారికి రంజాన్ మాసం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరించి, భక్తితో ప్రపత్తులతో నమోదు చేయడం పరిపాటి.. ఎంతో వేడుకగా జరుపుకునే ఈ పండుగకు కరోనా కారణంగా కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఎంతో క్రమశిక్షణతో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలు ఈ పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ శుభతరుణంలో నా తరఫున జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఇక ప్రతి ఏడాది ఈ రోజున ముస్లిం సోదరులు, సోదరిమణులు ఈ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుంటారు. కానీ ఈ ఏడాది కరోనా నేపథ్యంలో వారు మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి. ఒకరిని ఒకరు కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటిస్తూ వారు ఇండ్లకే పరిమితమై ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.




Tags:    

Similar News