వైసీపీ నేతలు అధికార గర్వంతో దాడులు చేస్తున్నారు : పవన్ కళ్యాణ్
ఏపీలో ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుకొటా ఇంటిపై ఓ యువకుడు దాడి చేయడం అమానుషమన్నారు.
ఏపీలో ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు అధికార గర్వంతో దాడులకు తెగబడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుకొటా ఇంటిపై ఓ యువకుడు దాడి చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును పవన్ ఖండిచారు. బాధితులపై ఎదురు కేసు పెట్టడం ఏటని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
"ప్రశ్నించినవారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడటం, పోలీసులతో బాధితులపైనే కేసులు వేయించడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇందార్డ్ శ్రీమతి. వినుత కోటా ఇంటిపై ఓ యువకుడు దాడికి తెగబడి ఆ ఇంటినీ, వారి వాహనాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. దాడితో బాధితులైన శ్రీ వినుత కుటుంబంపైనే ఎదురు కేసు నమోదు చేయడం వెనక పోలీసులపై అధికార వైసీపీ నేతల ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం అవుతోంది.
వాస్తవాలను పరిశిలించి, చట్టప్రకారం పని చేయాల్సిన పోలీసులు వైసీపీ నాయకులు చెప్పిన విధంగా పని చేస్తే బాధితులకు న్యాయం ఎలా దొరుకుతుంది? శ్రీమతి వినుత కోటా కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార పక్షం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంలో కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల సూచనలతోనే కొందరు పోలీసు అధికారులు పని చేసి- జనసేన నాయకులను, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
ఇప్పుడు మరోమారు బాధిత కుటుంబంపైనే కేసులుపెట్టారు. అధికార పార్టీ అప్రజాస్వామిక పద్దతుల్లో వెళ్తూ గూండాయిజానికి పాల్పడితే జనసేన మౌనంగా ఉండదు. కచ్చితంగా నిలదీసి ప్రశ్నిస్తుంది" అని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో తెలిపారు.