Pawan Kalyan Comments on AP Government: ప్రభుత్వ తీరుపై పవన్ వ్యాఖ్యలు.. సరిదిద్దుకోవాలని సూచన
Pawan Kalyan Comments on AP Government: రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల విషయమై వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత వపన్ కల్యాణ్ స్పందించారు.
Pawan Kalyan Comments on AP Government: రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల విషయమై వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత వపన్ కల్యాణ్ స్పందించారు. వీలయినంత వరకుఅధికారులు కోర్టు మెట్లక్కకుండా సరిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు వెళ్ళడం ఎప్పుడూ జరగలేదు. ఈ పరిస్థితి వచ్చింది అంటే.. రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు ఆయన బలైపోతున్నారు' అన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత, రాజకీయ పరిణామాలు, విద్య, వైద్య వ్యవస్థలలోని గందరగోళం, గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి bతనఅభిప్రాయాలను వెల్లడించారు.
• పాలనలో తప్పులున్నాయని అర్థం చేసుకోవాలి ప్రశ్న: వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఆ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? పాలన ఎలా ఉంది?
- 151 సీట్లు సాధించడం ద్వారా చాలా బలమైన స్థిరత్వం ఇచ్చే శక్తి సమర్ధత ఈ పార్టీ పొందింది. అలా కాకుండా వాళ్లకున్న బలాన్ని రాజకీయ కక్షల కోసమో, కేవలం కొన్ని గ్రూపుల కోసమో ఓటు బ్యాంకు కోసమో వినియోగించాల్సిన అవసరం లేదు. ఇది వైసీపీకి భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదనే నా అభిప్రాయం. 60 కేసులకు పైగా హైకోర్టులో ఆక్షేపణలు ఎదుర్కోవడం గురించి కూడా పరిశీలన చేసుకోవాలి. తప్పులున్నాయని అర్ధం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఉన్న తప్పొప్పులు సరిదిద్ది స్థిరమైన పాలన చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ కక్ష సాధింపుల కోసం పాలన చేసున్నారు అనే భావన ఉంది.
• భావితరాల జీవితాలు పణంగా పెడుతున్నారు
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ప్రమాదకర రీతిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థలు లెక్కలు చెబుతున్నాయి. రుణ, జీఎస్డీపీ నిష్పత్తి 36.4 శాతం ఉంది. అయితే ప్రణాళికా సంఘం 25 శాతం మించిఉండకూడదు అని చెబుతున్నారు. రాష్ట్రంలో అప్పులు రూ.3,41,271 కోట్లకు చేరింది. దీన్ని మీరెలా విశ్లేషిస్తారు?
- సగటు మనిషికి అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే- మనం సంపాదించే దానికంటే అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతత, సుఖం ఎక్కడ ఉంటుంది. చిన్న కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే తండ్రి అప్పులు చేసి పిల్లల్ని పెంచుతున్నప్పుడు.. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందో పిల్లలకు తెలియదు. కానీ ఒక రోజున తండ్రి చేతులు ఎత్తేస్తే ఆ భారం పిల్లల మీదే పడుతుంది. అలా తీసుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. గత ప్రభుత్వంలో ఈ అప్పులు ఉన్నాయి. వీళ్లు ఇంకా ఎక్కువ చేసేశారు. అలా జరగకుండా చూసుకోవాలి.
ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి గానీ, ఆదాయం పెంచే మార్గాలు కాకుండా అప్పులు పెంచే మార్గాలు వెతికి దాన్ని అబివృద్ధి అంటే అందుకు మనం ఏమీ చేయలేం. దీని వల్ల ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు ఏమీ కాదు. రాజకీయనాయకులు డబ్బు సంపాదించడం కోసం భవిష్యత్ తరాల జీవితాన్ని పణంగా పెడుతున్నారు. విద్యా వ్యవస్థ సరిగా ఉండదు, వైద్య వ్యవస్థ సరిగా ఉండదు. పరిశ్రమలు రావు. ఉపాధి అవకాశాలు రావు. అందుకే మనం ఎప్పుడూ అణగారిపోయి ఉంటాం. మనల్ని నడిపే రాజకీయ వ్యవస్థ మాత్రం చాలా బాగుంటుంది.
ఎందుకంటే అవి వాళ్ల సొంత ఆస్తులు కాదు. బయట నుంచి అప్పులు తీసుకుంటారు. ఇక్కడున్న రాష్ట్ర ఉమ్మడి ప్రకృతి వనరులన్నీ వాళ్లకి తాకట్టు పెట్టేయాల్సి వస్తుంది. కచ్చితంగా ఇది అభివృద్ధి కానే కాదు. అప్పులు తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంటే దీన్ని అభివృద్ధి అనం. తిరోగమనం అనొచ్చు కచ్చితంగా దీన్ని. ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది. వైసీపీ నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి వైపు వెళ్ళాలి.