Y S Jagan: ఎమ్మెల్సీలతో ముగిసిన జగన్ సమావేశం... 2024 ఎన్నికల ఫలితాలపై చర్చ

Y S Jagan: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలి

Update: 2024-06-13 08:41 GMT

Y S Jagan: ఎమ్మెల్సీలతో ముగిసిన జగన్ సమావేశం... 2024 ఎన్నికల ఫలితాలపై చర్చ

Y S Jagan: రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన దాడుల్లో గాయపడిన బాధితులను జగన్ పరామర్శించనున్నారు. బాధితులకు పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రాష్ట్రపతితోపాటు కేంద్రానికి వైసీపీ శ్రేణులు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. ఏపీ హైకోర్టులోనూ దాడులపై పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.

తమ పార్టీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం ముగిసింది. 2024 ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇక శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. నాలుగైదు కేసులు పెట్టిన భయపడవద్దని.. 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారన్నది మర్చిపోవద్దని భరోసానిచ్చారు. చేసిన మంచి ఇప్పటికే ప్రజలకు గుర్తు ఉందన్న జగన్.. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన్నారు.

ఈవీఎంల వ్యవహారాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని.. ఈనెల ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదన్నారు. వారికి మరికొంత సమయం ఇద్దాం.. ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే ఛాన్స్ ఉందన్న జగన్.. శాసనమండలిలో గట్టిగా పోరాటం చేద్దామన్నారు.

Tags:    

Similar News