GSLV-F14: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

GSLV-F14: నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 దూసుకెళ్లింది.

Update: 2024-02-17 12:17 GMT

GSLV-F14: నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-14

GSLV-F14: నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌–3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-F 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌–3డీ, ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్‌శాట్‌–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి.

Tags:    

Similar News