Weather Report Today: తీరం దాటిన వాయుగుండం..డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు
Weather Report: భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే వాయుగుండం ఒడిశా వద్ద తీరం దాటింది. ప్రస్తుతం అక్కడ గాలివేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు ఉంది. నేడు, రేపు ఈ వాయుగుండం ఒడిశా, చత్తీస్ గఢ్ వైపు వెళ్తోంది. దీని ప్రభావం ప్రభావం ప్రధానంగా కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణపై కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Report: భారత వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే వాయుగుండం ఒడిశా వద్ద తీరం దాటింది. ప్రస్తుతం అక్కడ గాలివేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు ఉంది. నేడు, రేపు ఈ వాయుగుండం ఒడిశా, చత్తీస్ గఢ్ వైపు వెళ్తోంది. దీని ప్రభావం ప్రభావం ప్రధానంగా కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణపై కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాంధ్రలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. తెలంగాణ, ఏపీో బారీ వర్షాలు సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఉన్నట్లు తెలిపింది.
ఇక ఆదివారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అవి నేడు సాయంత్రం వరకు కొనసాగుతాయి. ప్రధానం నేడు ఉత్తరాంధ్రపై అతి భారీ వర్షాలు పడే సంకేతాలు ఉన్నట్లు కనిపిస్తోంది. రోజంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. తీరప్రాంతాల్లో గంట 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో జాలర్లు నేడు వేటకు వెళ్లకపోవడమే మంచిదని వాతావరణశాఖ చెబుతోంది.
కాగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో ఆ ప్రభావం చూపిస్తోంది. ఎక్కువగా అటవీ ప్రాంతం నిండు కొండలు పచ్చనం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ నగరం వరద దాటికి అతలాకుతలం అయ్యింది. గోదావరి ని పరివాహన ప్రాంతాలకు భారీగా వర్షపునీరు చేరడంతో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అన్న భయం పట్టుకుంది.
వాయుగుండం ప్రభావ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. విజయనగరం, విశాఖ, ఉమ్మడి గోదావరి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు.