తాడేపల్లిలో కూల్చివేత: విశాఖ ఎండాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారుల నోటీసులు

GVMC Notice: విశాఖపట్టణం జిల్లా చినగడిలి ఎండాడ వద్ద నిర్మించిన వైఎస్ ఆర్ సీపీ కార్యాలయ నిర్మాణ పనులు అక్రమమంటూ జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-06-22 06:54 GMT

తాడేపల్లిలో కూల్చివేత: విశాఖ ఎండాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారుల నోటీసులు

GVMC Notice: విశాఖపట్టణం జిల్లా చినగడిలి ఎండాడ వద్ద నిర్మించిన వైఎస్ ఆర్ సీపీ కార్యాలయ నిర్మాణ పనులు అక్రమమంటూ జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. శనివారం నాడు అమరావతిలో అక్రమంగా నిర్మిస్తున్నారనే ఆరోపణలతో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు.

జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ స్థలంలో వీఎంఆర్డీఏ నుండి అనుమతులతో కార్యాలయం నడిపించడంపై జీవీఎంసీ అధికారులు అక్రమంగా తెలిపారు. వారం రోజుల్లో ఈ విషయమై వివరణ ఇవ్వాలని జీవీఎంసీ కోరింది. లేకపోతే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు.

ఈ భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆన్ లైన్ లో ఎం. సాయి శరణ్ ధరఖాస్తు చేశారు. ఈ విషయమై అధికారులు నోటీసులు జారీ చేశారు. విశాఖపట్టణం జిల్లాలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేయాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ నేతృత్వంలో బృందం జీవీఎంసీ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు.

తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇది నియంత పాలనకు పరాకాష్టగా నిలుస్తుందని జగన్ విమర్శించారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఈ నిర్మాణాలను కూల్చివేశారని ఆయన ఆరోపించారు.



Tags:    

Similar News