Kidney Scam: 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. గుంటూరులో భారీ మోసం

Kidney Scam: గుంటూరు ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు

Update: 2024-07-08 15:10 GMT

 Kidney Scam: 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. గుంటూరులో భారీ మోసం

Kidney Scam: విజయవాడలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. కిడ్నీ దానం చేస్తే 30లక్షలు ఇస్తామని ముఠా ఆశ చూపి మోసం చేసింది. ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాక డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరించింది. బాధితుడు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గుంటూరుకు చెందిన మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అతనికి విజయవాడకు చెందిన బాషా సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. కిడ్నీ దానం చేస్తే 30లక్షలు ఇప్పిస్తానని నమ్మ బలికాడు. డబ్బులతో సమస్యలు తీరుతాయని మధుబాబు భావించాడు. విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు. మధుబాబుకు కేవలం లక్ష 10వేలు మాత్రమే బాషా ఇచ్చాడు. స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని బాషా తెలిపాడు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని బెదిరించాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్ శరత్‌బాబు, మధ్యవర్తి బాషాపై జిల్లా ఎస్పీకి మధుబాబు ఫిర్యాదు చేశాడు.

Tags:    

Similar News