DIG Rajasekhar: ఇద్దరికీ 6 నెలలుగా ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం
DIG Rajasekhar: బీటెక్ విద్యార్ధిని రమ్యశ్రీని నిందితుడు శశికృష్ణే హత్య చేశాడని గుంటూరు ఇంచార్జ్ డీఐజీ రాజశేఖర్ అన్నారు.
DIG Rajasekhar: బీటెక్ విద్యార్ధిని రమ్యశ్రీని నిందితుడు శశికృష్ణే హత్య చేశాడని గుంటూరు ఇంచార్జ్ డీఐజీ రాజశేఖర్ అన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో గత 6 నెలలుగా శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడిందని అప్పటినుంచి శశికృష్ణ ఆమెను కాలేజీ వద్ద కలుస్తూ, ప్రేమిస్తున్నానని వేధించాడన్నారు. ప్రేమ నిరాకరించిందన్న అక్కసుతోనే శశికృష్ణ ఆమెపై కత్తితో దాడి చేశాడని, ఆరు చోట్ల గాయపరిచాడని డీఐజీ అన్నారు.
మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలనీ డిఐజీ సూచించారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకుని కేసును ఛేదించారని ప్రశంసించారు. ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు. మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని, మహిళల రక్షణకై అహర్నిశలు శ్రమిస్తున్నామని ఇన్‌ఛార్జ్ డీఐజీ తెలిపారు.