Tirumala: తిరుమల వెంకన్న సన్నిధిలో ఘనంగా ఉగాది వేడుకలు
Tirumala: శ్రీవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు
Tirumala: శ్రీక్రోధినామ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను తిరుమల వెంకన్న సన్నిధిలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. జీయంగార్లు సమక్షంలో అర్చకస్వాములు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, శుద్ది, తోమాల సేవాలనంతరం బంగారు వాకిలిలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తలతో పాటు సేనాధిపతి విశ్వక్సేనుల ఉత్సవమూర్తులను వెంచేపు చేసి అర్చకుకు విశేష సమర్పణ చేసారు. అనంతరం వేదపండితులు ఉగాది ఆస్థానాన్ని నిర్వహించగా, సిద్ధాంతులు పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఉత్సమమూర్తులకు జరిగే విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక గతేడాది కంటే భిన్నంగా అత్యద్భుతంగా ఫల,పుష్పాలంకరణాలను తిరుమల కొండపైన టీటీడీ ఉద్యానవనశాఖ చేసింది. ప్రధానంగా శ్రీవారి ఆలయంలో అరుదైన విదేశీ జాతికి చెందిన లక్ష కట్ ఫ్లవర్స్ తో చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. అలాగే వివిధ పండ్లు, తాజా కూరగాయలతో అక్కడక్కడ చేసిన అలంకరణలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి.