Folk Singer Vangapandu Passed Away: మూగబోయిన వంగపండు గొంతు.. ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూత
Folk Singer Vangapandu Passed Away: వంగపండు గొందు మూగబోయింది... తను శాశ్వతంగా పాడటానికి వీలు లేకుండా తుది శ్వసను విడిచారు.
Folk Singer Vangapandu Passed Away: వంగపండు గొందు మూగబోయింది... తను శాశ్వతంగా పాడటానికి వీలు లేకుండా తుది శ్వసను విడిచారు. ఆయన పాటతో ఎంతోమందిలో దేశభక్తిని రగించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇక లేదని తెలియడంతో జానపద కళాకారులు, ప్రముఖులు తట్టుకోలేకపోతున్నారు.
ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తెల్లవారుజామున పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాసను విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించడమే కాకుండా.. వాటికి గజ్జెకట్టి ఆడి పాడారు. పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు.. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని ఎలుగెత్తి.. గొంతెత్తారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జానపద కళాకారులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఈయన పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో 1943 జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి.2008, నవంబరు 23 న తెనాలిలో ఈయనకు బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును బి.నరసింగరావు చేతులమీదుగా ప్రధానం చేశారు. ప్రజలకోసం బ్రతికిన నాజర్ లాంటి కళాకారుడని వంగపండును పోలుస్తారు. వంగపండు ప్రసాదరావు, గద్దర్తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది. విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు, గద్దర్ మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.
తనది విజయనగరం జిల్లా పెదగొండపల్లి. పెరిగింది గ్రామీణ వాతావరణం. సామాన్య రైతు కుటుంబం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురు అన్నదమ్ములం. నేనే పెద్దవాడు. చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫెయిల్ కావడంతో బొబ్బిలిలో ఐటీఐ చేరాడు. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే, ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ యుద్ధం ఆగిపోవడంతో ఊరుబాట పట్టాడు. అప్పటికే వాళ్ల నాన్న ఊళ్లో భూమి అమ్మేసి, రాయగఢ్‌లో కొన్నాడు. అక్కడ ఆయనకు వ్యవసాయంలో కొన్నాళ్లు తోడుగా ఉన్నాడు. ఆ భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు.. వారి పదాలు ఆయన పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా 'ఓరేయ్ కవీ' అని పిలిచేవారు. అప్పట్లో అర్థంకాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడు. . నేనేదో లల్లాయ పదాలతో పాటలు అల్లుకుపోయేవాడు. తన చేత పాటలు పాడించుకుని, సరదా పడేవారు. అంతవరకు సరదా సరదాగా గడిచిపోయింది. పెళ్లైన రెండేళ్లకు మొదలైన నక్సల్స్‌బరి ఉద్యమం తనలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.
ఎక్కడ ఉన్నా సరే ఉద్యమమే. అదే జీవితమైంది. ఆ ఉద్యమంలో ఎంతోమందిని కలిశాడు. ఎందరి కష్టాలనో చూశాడు. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపుకట్టారు. ఆ ఊపులో 400కు పైగా జాన పద పాటలు రాసారు. వాటిలో 200కు పైగా గీతాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి.ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే నాకు ఆత్మసంతృప్తినిచ్చేది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా ఉద్యమం వైపే ఉండేది. దీంతో పదిరోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లమ్మట పడి తిరగడం చేశారు. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగారు. ఇలా తిరుగుతూ ఉంటే ఏమౌతుంది.. ఇంట్లో పూట గడవని స్థితి. ఒక పూట తింటే మరో పూట పస్తే! అయినా సరే నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ల సర్వీసులో ఉన్నా తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పూర్తిస్థాయి ఉద్యమంలోనే ఉన్నారు.