ఏపీ, తెలంగాణ మధ్య 10 ప్రత్యేక రైళ్లు!

Festival Special Trains : దసరా,దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి. ఈ మేరకు దక్షణ రైల్వే ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

Update: 2020-10-15 06:05 GMT

Festival Special Trains : దసరా,దీపావళి పండుగల సీజన్ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి. ఈ మేరకు దక్షణ రైల్వే ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లు ఇవే..

ప్రతీ రోజూ నడిచే రైళ్ళు ఇవే : తిరుమల ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, శబరి ఎక్స్‌ప్రెస్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్, హుబ్లీ ఎక్స్‌ప్రెస్

♦ వారంలో ఐదు రోజులు నడిచే రైళ్ళు ఇవే : విశాఖపట్నం – విజయవాడ డబుల్ డెక్కర్ ట్రైన్

♦ వారానికి మూడు రోజులు నడిచే రైళ్ళు ఇవే : రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్

♦ వారానికి రెండు రోజులు నడిచే రైళ్ళు ఇవే: జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌(వయా నాందేడ్), తిరుపతి-అమరావతి(మహారాష్ట్ర)

♦ వారానికి ఒక రోజు నడిచే రైళ్ళు ఇవే : గౌహతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌-తిరుపతి(వయా విజయవాడ), విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్.. వీటితో పాటు మరికొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదగా నడుస్తాయి.


అయితే ఒక పక్కా పండగ సీజన్ కావడం, మరోపక్కా కోవిడ్ మహమ్మారి పెరుగుతూ ఉండడంతో రైల్వే భద్రతా దళం (ఆర్‌పీఎఫ్‌) కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 

మార్గదర్శకాలు ఇవే!

1. మాస్క్ ధరించడం తప్పనిసరి.. మాస్క్ ధరించకుండా రైల్వే పరిసరాలకు కుడా రావొద్దు.

2. సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.

౩. కరోనా సోకిందని తెలిసి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రావొద్దు.. రైల్లో ప్రయాణించవద్దు.

4. కరోనా వైరస్ పరీక్ష చేసుకొని, ఫలితం కోసం ఎదురుచూసేవారు కూడా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి రావొద్దు.. రైల్లో ప్రయాణించవద్దు.

5. రైల్వే స్టేషన్ వద్ద హెల్త్ చెక్ అప్ బృందానికి కచ్చితంగా సహకరించాలి..లేనిచో చర్యలు తప్పవు!

6.బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేయకూడదు. చెత్తాచెదారం వేయకూడదు.

7. ప్రజల ఆరోగ్య దృష్ట్యా చుట్టూ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్ర వాతావరణాన్ని సృష్టించవద్దు!

8. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి!


Tags:    

Similar News