ఏపీ 'ఎస్‌ఈసీ' పై దుష్ప్రచారం.. రంగంలోకి పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) జస్టిస్ వి.కనగరాజ్‌పై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) జస్టిస్ వి.కనగరాజ్‌పై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.. ఫోటోలు మార్ఫింగ్ చేసి క్రిస్టియన్ గా ప్రచారం చేస్తున్నారు.. దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది.
ఈ వ్యవహారాన్ని ఎస్‌ఈసీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని కనగరాజుగా మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు. ఎస్‌ఈసీ ఫిర్యాదుతో కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ విధులకు హాజరయ్యారు. సోమవారం కార్యాలయ అధికారులు, అన్ని స్థాయిల ఉద్యోగులతో కమిషనర్ సమావేశమవుతారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుంటే మొన్నటివరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసింది. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్ పై రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.