AP Liquor Policy: ఏపీ కొత్త మద్యం పాలసీపై స్పీడ్ పెంచిన ఎక్సైజ్ శాఖ

AP Liquor Policy: అన్ని రకాల MNC బ్రాండ్లకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం యోచన

Update: 2024-08-12 15:19 GMT

AP Liquor Policy: ఏపీ కొత్త మద్యం పాలసీపై స్పీడ్ పెంచిన ఎక్సైజ్ శాఖ

AP Liquor Policy: ఏపీలో కొత్త మద్యం పాలసీ, ప్రొక్యూర్‌మెంట్ పాలసీపై ఎక్సైజ్‌శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ కొత్త మద్యం విధానంపై 2 రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు నివేదికలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అధికారులు 6 రాష్ట్రాల్లో పర్యటించి మద్యం విధానాలపై అధ్యయనం చేశారు. అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అన్ని రకాల MNC బ్రాండ్లకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. నూతన మద్యం పాలసీ రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90లోపే నిర్ధారించాలని సర్కార్‌ యోచిస్తోంది. కాగా.. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

Tags:    

Similar News