Srikakulam: మత్స్యకారుల వలకు చిక్కిన డ్రోన్ జెట్..!
శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద డ్రోన్ జెట్ కలకలం
Srikakulam: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరానికి డ్రోన్ జెట్ కొట్టుకొచ్చింది. మూలపేట, భావనపాడు మధ్య చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు సముద్రంలో తేలియాడుతూ డ్రోన్ కనిపించింది. దీనిని గుర్తించిన మత్స్యకారులు... బోటులో భావనపాడు తీరానికి చేర్చారు. వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకొని డ్రోన్ జెట్‌ను పరిశీలించారు. దీన్ని ఎవరు ప్రయోగించారు? ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలను ఆరా తీస్తున్నారు.