Coronavirus: వైద్యున్ని వదలని కరోనా

Coronavirus: పౌష్టికాహారంతోనే వైరస్‌ను జయించాలంటున్న వైద్యుడు * వైరస్ ను జయించి విధుల్లో చేరిన వైద్యుడు

Update: 2021-05-21 12:12 GMT

Representational Image

Coronavirus: కరోనా మహమ్మారి ప్రాణం పోస్తు్న్న వైద్యులను వదలడం లేదు. వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందిస్తూ డాక్టర్లు వైరస్ బారిన పడుతున్నారు. అయితే కరోనా సోకిందని మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంతో చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నానంటున్న ఓ డాక్టర్ కరోనా విన్నర్ గురించి తెలుసుకుందాం.

ఈయన పేరు సోమలరాజు రెడ్డి మహేశ్వర రాజు. ఈయన రాయచోటి ఏరియా ఆసుపత్రిలో సూపరిటెండెంట్‌గా చేస్తు్న్నారు. అయితే కరోనా మొదలైన నాటి నుంచి రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు సేవలందించారు. మొదటి వేవ్ తగ్గుముఖం పట్టడంతో కొంత ఉపిరి పీల్చుకున్నారు. అంతలోనే సెకండ్ వేవ్ మొదలై కేసుల సంఖ్య పెరిగింది. బాధితులు పెరగడంతో ప్రతి రోగికి అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించారు.

కానీ ఇంతలోనే రోగులకు చికిత్స అందిస్తూ ఆయన కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు సోకింది. మనోధైర్యంతో హోం క్వారంటైన్ లో ఉండి తగిన జాగ్రత్తలు పాటించారు. పరిస్ధితిని బట్టి మందులు వాడుతూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకున్నారు. ఒకానొక దశలో ఊపిరి బిగబట్టడం వంటి పరిస్ధితులు ఎదురైనా ఆందోళనకు గురి కాలేదు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయడం, మంచి మందులు తీసుకుంటూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపుతూ పది రోజుల్లోనే తిరిగి ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. కరోనాను జయించి తిరిగి విధుల్లోకి చేరిన ఆయన కొవిడ్ బాధితులకు వైద్యం అందిస్తున్నారు.

ప్రస్తుతం తన కొవిడ్ అనుభవాలను కరోనా బాధితులకు వివరిస్తూ రోగుల్లో మరింత మనోధైర్యాన్ని నింపుతున్నారు. మందులు, ఫుడ్ ఓ పక్క అయితే ధైర్యంగా ఉండటమే ముఖ్యమని పలువురిలో స్పూర్తి నింపుతున్నారు. కరోనా వస్తే వైద్యం అందక చనిపోతున్నారన్న భయాలు వీడి ధైర్యంతోనే వైరస్‌ను ఎదుర్కోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News