Visakhapatnam: పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ

విశాఖపట్నం: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2020-04-25 13:19 GMT

విశాఖపట్నం: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే శ్రీ మహాకామేశ్వరి ద్రావిడ సంక్షేమ సంఘం, వ్యాసపీఠం సంయుక్తంగా పెందుర్తిలో గల 700 నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దవళ చైన్లు మాట్లాడుతూ.... ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అనేక మంది బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సమాజానికి తమ వంతు సహాయం అందించాలని కోరారు. అలాగే లాక్ డౌన్ ప్రతి ఒక్కరు పాటించి ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వస్తే తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకొని కరోనా వైరస్ ఇన్ తరిమికొట్టాలని చైన్లు కోరారు. ఈ కార్యక్రమంలో మధుసూధనరావు, జి.మూర్తి, శాస్త్రి, యు.శర్మ, ఏం.సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News