Curfew Relaxation: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
Curfew Relaxation: ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Curfew Relaxation: ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో ఈ సడలింపులు వర్తించనున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపు ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఇక ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6గంటల వరకే సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత అన్ని షాపులను క్లోజ్ చేయాల్సిందే. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేట్ 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తించనున్నాయి.