Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 10,368 పాజిటివ్ కేసులు...
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,368 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59, 834 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,368 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 9,350 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 84 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 14, తూర్పుగోదావరి 10, పశ్చిమగోదావరి 11, అనంతపురం 07, గుంటూరు 07, విశాఖపట్నం 07, నెల్లూరు 06, కడప 05, కృష్ణా 04, శ్రీకాకుళం 04, కర్నూలు 04, ప్రకాశం 03, విజయనగరం జిల్లాలో 02 చొప్పున మరణించారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,45,139. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,053. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,39,876కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 1,01,210 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 37,82,746 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.
ఇక ఇప్పటివరకు జిల్లాల వారిగా నమోదైన కేసులు చూస్తే.. అనంతపురం 456, చిత్తూర్ 1068, తూర్పు గోదావరి 1208, గుంటూరు 614, కడప 994, కృష్ణ 311, కర్నూల్ 813, నెల్లూరు 1059, ప్రకాశం 888, శ్రీకాకుళం 629, విశాఖపట్నం 825, విజయనగరం 552, పచ్చిమ గోదావరిలో 948 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 60,611, కర్నూల్ జిల్లా 45,558, అనంతపురం జిల్లా 41,584, పచ్చిమ గోదావరి జిల్లా 38,054, చిత్తూర్ జిల్లా 37,717, విశాఖపట్నం జిల్లా 37,519, గుంటూరు జిల్లాలో 36,378 కేసులు నమోదయ్యాయి.