Old Man Disappears in Vijayawada: నా భర్తను చూపించండి.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భార్య ఆందోళన!
Old Man Disappears in Vijayawada: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండడం అందరిని కలవర పెడుతుంది.
Old Man Disappears in Vijayawada Coronavirus Hospital: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండడం అందరిని కలవర పెడుతుంది.. ఈ క్రమంలో కొందరు కోవిడ్ ఆసుపత్రి నుంచి అదృశ్యం కావడం అందరిని మరింతగా షాక్ కి గురిచేస్తోంది.. తాజాగా కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వసంతరావు అనే ఓ వృద్దుడు అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. దీనితో అతని కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.. వారం రోజులు అయినప్పటికీ ఆతని ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన పై వసంతరావు భార్య ధనలక్ష్మి మాట్లాడుతూ.. తన భర్తకు బాగా ఆయాసం రావడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లామని, అక్కడ వైద్యులు ఆయనకి కరోనా లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని చెప్పారని ధనలక్ష్మి వెల్లడించింది. అనంతరం జూన్ 24వ తేదీన ఆస్పత్రికి వెళ్లమని, అక్కడ వైద్య సిబ్బంది మొదటగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇక చివరగా ఓ వీల్ చెర్ లో కూర్చోబెట్టి లోపలకు పంపారని ధనలక్మి తెలిపింది. తన భర్తకు పల్స్ పడిపోతున్నాయని, ఆక్సిజన్ పెట్టాలని వైద్యులు తనకు చెప్పారని, వైద్యం అందించాలని ఉదయం నుంచీ సాయంత్రం వరకు అక్కడే ఉన్న తనను ఇంటికి పంపేశారని ధనలక్మి చెప్పుకొచ్చింది.
ఇక మరుసటి రోజు ఆస్పత్రికి వెళితే తన భర్త కనిపించడం లేదని అక్కడి సిబ్బంది చెప్పారని వెల్లడించింది.. తన భర్త జాడ కోసం గత నాలుగు రోజులు పాటు ఆస్పత్రి చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ధనలక్మి వాపోయింది. దీనిపైన పోలీసులు ఇంటికి వచ్చి అన్ని వివరాలు రాసుకెళ్లారని, అయినప్పటికీ వారం గడిచిన ఆచూకీ దొరకలేదని, అధికారులు వెతుకుతున్నామని చెబుతూనే ఉన్నారని ధనలక్ష్మి తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ఇదే విషయం పైన వసంతరావు బంధువు శంకర నారాయణ మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న కోవిడ్ ఆస్పత్రికి వెళ్ళమని అయితే ఆరాత్రి నుంచే వసంత రావు కనిపించడం లేదని , దీనిపైన పోలీసులు ఇంటికి వచ్చి అన్ని వివరాలు నమోదు చేసుకున్నారన్నారు. వారం గడుస్తున్న ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి ఆచూకీ లభించలేదని, దీనిపైన కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు..