Corona Effect On TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై కరోనా ఎఫెక్ట్.. పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి!

Corona Effect On TTD: కరోనా ఎఫెక్ట్ శ్రీవారి బ్రహ్మోత్సవాలపై పడింది. అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల మధ్య ఊరేగుతూ అందరికీ ఆశీస్సులు పంచే వెంకన్నకు ఈసారి మాత్రం భక్త జనకోటి కోలాహలం కనిపించే పరిస్థితి లేదు.

Update: 2020-08-12 15:40 GMT
శ్రీవారి బ్రహ్మోత్సవాలు (ఫైల్ ఇమేజ్)

Corona Effect On TTD: కరోనా ఎఫెక్ట్ శ్రీవారి బ్రహ్మోత్సవాలపై పడింది. అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల మధ్య ఊరేగుతూ అందరికీ ఆశీస్సులు పంచే వెంకన్నకు ఈసారి మాత్రం భక్త జనకోటి కోలాహలం కనిపించే పరిస్థితి లేదు. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిన ఈదశలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పరిమిత సంఖ్యలో భక్తుల మధ్య నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 19 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కాగా, అక్టోబర్ 16న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 18న అంకురార్పణతో మొద‌లయ్యే సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌ర్ 27న చ‌క్రస్నానంతో ముగియ‌నున్నాయి.

ఇప్పటికే టీటీడీ ఉద్యోగుల్లో 743 మంది క‌రోనా వైరస్ బారిన ప‌డ‌గా ఓ అర్చకుడు స‌హా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 402 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా, మ‌రికొంత మంది వివిధ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప‌రిమిత సంఖ్యలోనే భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని టీటీడీ నిర్ణయించింది. దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

ఇక క‌రోనా నేప‌థ్యంలో భ‌క్తుల రాకపోకలు కూడా త‌గ్గిపోయాయి. ప్రతి రోజూ ల‌క్షల్లో శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య ప్రస్తుతం రోజుకు గ‌రిష్టంగా 8 వేల మందికి త‌గ్గింది. వ‌చ్చే నెల‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా భ‌క్తులు పెరిగే అవ‌కాశం ఉన్నందున క‌ట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయ‌నున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News