Andhra Pradesh: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు
Andhra Pradesh: ప్రభుత్వంలోని ఎనిమిది శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగించింది.
Andhra Pradesh: ప్రభుత్వంలోని ఎనిమిది శాఖల్లో పనిచేస్తోన్నకాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగించింది. ఈమేరకు పదవీ కాలం పొడిగింపునకు అనుమతినిస్తూ ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రభుత్వంలోని ' శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద గురువారం తొలి విడత సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతు భరోసాకు ఈ ఏడాది 52,38,517 రైతు కుటుంబాలు అర్హత పొందగా, వీరిలో 1,86,254 మంది భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అటవీ సాగు దారులున్నారు. వీరందరికీ పీఎం కిసాన్ కింద రూ.1,010.45 కోట్లు, రైతు భరోసా కింద రూ.2,918.43 కోట్లు కలిపి.. తొలి విడతగా రూ.3,928.88 కోట్లు జమ చేయనున్నారు.