CM Jagan on Godavari floods: వరదలపై సీఎం జగన్ ఆరా
CM Jagan on Godavari floods: ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
CM Jagan on Godavari floods: ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరి వరద పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి గురించి సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మందిని తరలించారని, వచ్చే వరదను దృష్టిలో ఉంచుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆయనకు తెలిపారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ముఖ్యంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారిని రక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి వారికి అన్నిరకాల సౌకర్యాలు అందించాలన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణ శాఖతో అధికారులు సమన్వయం చేసుకోవాలని, గోదావరి వరద ఉద్ధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. అలాగే కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.