Nadu-Nedu Program in Schools: సెప్టెంబర్ 5న స్కూల్స్ తెరవడానికి సిద్ధం చేయండి: సీఎం జగన్
Nadu-Nedu program in schools: ఏపీ సీఎం జగన్ నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు తెరిచే నాటికి సర్వం సిద్ధంగా ఉండాలి. నాడు–నేడులో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలి. ప్రతి స్కూల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. అందమైన వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలి. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్ ఉండాలి. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలి. దానిపై అధికారులు మరింత ఫోకస్డ్‌గా పని చేయాలి అని సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
స్కూళ్లు తెరిచే రోజు (సెప్టెంబరు 5)న విద్యార్థులకు ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్ క్లాత్.. అన్నింటినీ స్వయంగా పరిశీలించిన సీఎం వాటి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. ఈ సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.