నష్టపోయిన రైతులకు బీమా అందించే ఉద్దేశంతో వైఎస్సాఆర్ బీమాను ఏపీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్‌లో ప్రారంభించారు. 2019 సీజన్‌లో నష్టపోయిన రైతులకు పరిహారం అందించనున్నారు. గతంలో రైతు బీమా ఎవరికి అందుతుందో కూడా తెలియదని ఇప్పుడు అందరికి అందే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం వెల్లడించారు. ఇప్పుడు రైతుల తరుపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ డబ్బులు కడుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
వైఎస్సాఆర్ బీమా పథకం నేరుగా రైతుల అకౌంట్‌లో బీమా డబ్బులు జమ అవుతాయని సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో సాగు వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. రైతుల తరుపున బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఆర్‌బీకే ద్వారా ఈ క్రాప్ వివరాలు సేకరిస్తున్నారన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.