సీఎం జగన్ రుణం తీర్చుకోలేమంటూ భావోద్వేగం.. కాలినడక తిరుమలకు హని తల్లిదండ్రులు, మేనమామ

* 15 రోజులకోసారి రూ.74 వేల విలువైన ఇంజెక్షన్‌.. గత జులైలో కోనసీమ పర్యటనలో మాట ఇచ్చిన జగన్.. ఇచ్చిన మాట ప్రకారం వైద్యం చేయించిన సీఎం జగన్

Update: 2022-11-24 01:11 GMT

సీఎం జగన్ రుణం తీర్చుకోలేమంటూ భావోద్వేగం.. కాలినడక తిరుమలకు హని తల్లిదండ్రులు, మేనమామ

CM Jagan: ఏపీ సీఎం జగన్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి భారీ సాయం అందించారు. బుడి బుడి నడకల ఆ పాప ప్రాణాన్ని కాపాడారు. నిస్సహాయస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు. మాట ఇచ్చినట్టుగా చిన్నారి ఆరోగ్యాన్ని కాపాడారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండో సంతానమైన చిన్నారి హాని పుట్టుకతోనే కాలేయానికి సంబంధించిన అరుదైన గాకర్స్ బారీన పడింది. దీనికోసం 15 రోజులకోసారి 74 వేల విలువైన ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది.

నిరుపేదలైన హానీ తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. అంత డబ్బు పెట్టే స్తోమత లేక ఏం చేయాలో పాలుపోని సమయంలో సీఎం జగన్‌కు ఆర్జీ పెట్టుకున్నారు. గత జూలైలో కోనసీమ వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో తమ పాపను కాపాడాలంటూ చేతపట్టుకున్న ఓ ప్లకార్డును చూసి ఆగిపోయారు. అక్కడికక్కడే దిగి వారి కష్టం గురించి తెలుసుకున్నారు. పాప అనారోగ్యం గురించి తెలుసుకుని చలించిపోయారు. అక్కడే మాట ఇచ్చారు ఎంతఖర్చైనా వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో తొలుత 10 లక్షల విలువైన 13 ఇంజెక్షన్లు, ఆ తర్వాత 40 లక్షలతో 52 ఇంజెక్షన్లను తెప్పించారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందించారు. చికిత్స తర్వాత.. చిన్నారి హానీ ఆరోగ్యం క్రమంగా బాగుపడింది. దీంతో సీఎం జగన్‌కు హానీ తల్లిదండ్రులతో పాటు మేనమామ కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తమ ఇంటి నుంచి కాలినడక 700 కిలోమీటర్ల మేర నడుస్తూ.. తిరుమలకు చేరుకున్నారు. తమ బిడ్డకు ప్రాణదానం చేసిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ చేసిన సాయం ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేమంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

Tags:    

Similar News