Mahasivaratri2021: మహాశివరాత్రి వేడుకల్లో సీఎం జగన్
Mahasivaratri2021: ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నశివరాత్రి వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
Mahasivaratri2021: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నశివరాత్రి వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రత్యేక పూజల్లో్ పాల్గొని శివలింగానికి అభిషేకం చేశారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం, మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీశైలంలో అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.