విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడం బాధాకరం: అయ్యన్న
*25 శాతం మంది స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి బతుకుతున్నారు : అయ్యన్న *పార్టీలన్నీ ఒక్క మాట పైకి వచ్చి ప్లాంట్ ను కాపాడుకోవాలి: అయ్యన్న *స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ నోరు విప్పాలి: అయ్యన్న
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టడం చాలా బాధాకరమంటున్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. స్టీల్ ప్లాంట్ చరిత్రను ముందు కేంద్రప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలని అన్నారు. 64 గ్రామాల ప్రజలు తమ విలువైన భూములను ఫ్యాక్టరీకోసం త్యాగం చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏడాదిన్నరలో20 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై జగన్ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్ పట్టాలపైనే ఆగిపోయిందా అని అయ్యన్న విమర్శించారు..