రామతీర్థ ఘటనపై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు పలు విమర్శలు చేశారు. దోషులను పట్టుకోవడం మానేసి రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలంటూ హింసించడం ఏంటన్నారు. తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవాడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు బాబు. అధికారులు కోరితే బావిలోకి దిగి సహకరించినందుకు అతని కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తారంటూ మండిపడ్డారు. నేరాన్ని టీడీపీపై నెట్టాలనుకునే కుట్రలను సహించబోమన్నారు ఆయన. వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు వేస్తే.. టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఇక దేవుడి విషయంలో పాపం మూటగట్టుకోవద్దంటూ పోలీసులకు సూచించారు చంద్రబాబు.