Chandrababu: మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు చంద్రబాబు.

Update: 2024-06-13 12:50 GMT

Chandrababu: మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకు సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు చంద్రబాబు. అనంతరం ఐదు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం (కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు: ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52), ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు పై రెండో సంతకం, పెన్షన్ల పెంపుపై మూడో సంతకం, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, నైపుణ్య గణన పై ఐదో సంతకం చేశారు సీఎం చంద్రబాబు.

అంతకుముందు సెక్రటేరియట్‌‌కు వచ్చే దారిలో సీఎం చంద్రబాబుకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా రాజధాని రైతులు ముఖ్యమంత్రిపై పూలవర్షం కురిపించారు. చంద్రబాబు కూడా రాజధాని ప్రాంత ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సెక్రటేరియట్‌కు చేరుకున్న తర్వాత మొదటి బ్లాక్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు చంద్రబాబు దంపతులకు ఆశీర్వచనం అందించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు.

Tags:    

Similar News