Amaravathi: ఏపీ కేబినెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాలు జరగకపోవడంతో.. ప్రభుత్వం మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 90వేల కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు.. కేబినెట్ ఆమోదం తెలపింది. దీంతో గవర్నర్ ఆమోదానికి పంపనుంది ప్రభుత్వం. తయారుచేసిన ఈ మూడునెలల బడ్జెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గరకు చేరగా.. ఒకట్రెండు రోజుల్లో కేబినెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.
2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. మూడు నెలల కాలానికి గాను కేబినెట్ దీనిని ఆమోదించింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.