Badvel By-Election: కొనసాగుతున్న బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్
* ఉదయం 8.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ * రాత్రి 7 గంటల వరకు పోలింగ్ * మొత్తం 281 పోలింగ్ కేంద్రాలు
Badvel By-Election: బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు 10శాతం పోలింగ్ నమోదైంది. ఇక రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఇక బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 16వేల 139 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో లక్షా 7వేల 340 మంది పురుషులు, లక్షా 8వేల 799 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో 148 సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు.
ఇదిలా ఉంటే బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం 11 వందల 24 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. 15 కంపెనీల కేంద్ర బలగాలు, 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లా సరిహద్దులో 23 చెక్‌పోస్టులు, బద్వేల్ నియోజవకర్గ సరిహద్దులో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా ఒక్కో చెక్‌పోస్టులో 10 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.