ఎస్ఈసీ నిమ్మగడ్డ ఓ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. వ్యక్తిగత అవసరాలకోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఈసీకి అధికారంతో పాటు బాధ్యతలుంటాయన్న మంత్రి నిమ్మగడ్డ అధికారాన్ని తప్ప బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరని ప్రధాని చెప్పారు. ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని.. వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబితే పట్టించుకోవడం లేదు.. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మంత్రి బొత్స ప్రశ్నించారు.