జగన్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వంతో ఏ మేరకు న్యాయ పోరాటం చేస్తుందో.. కన్నా కీలక వాఖ్యలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలల విషయంలో వివాదస్పదంగా మారుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-05-13 09:00 GMT
Kanna Lakshminarayana (File Photo)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలల విషయంలో వివాదస్పదంగా మారుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలోని క్వారంటైన్ కేంద్రాన్ని మాజీమంత్రి,బీజేపీ నేత రావెల కిశోర్ బాబుతో కలిసి పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 120 మంది బాధితులు ఉన్నారు.

రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశ్యం అనీ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే అంశంపై గతంలో బీజేపీ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందన్నారు. రాయలసీమ విషయంలో హీరోలతోపాటు మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ప్రభుత్వంతో జగన్ సర్కార్ ఏ మేరకు న్యాయ పోరాటం చేస్తుందో తెలియదని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందని... దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. నిజానికి ఇది అక్రమ ప్రాజెక్టు కాదని, ఏపీకి దక్కాల్సిన వాటా నీటిని మాత్రమే వాడుకుంటామని, ఆ వ్యవహారమంతా కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే సాగుతుందని జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News