Ayurvedic Medicine: ఏపీలో కరోనాకు ఆయుర్వేద ఔషధం.. మందు కోసం కిలోమీటర్ల మేర క్యూ
Ayurvedic Medicine: రాయలసీమలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Ayurvedic Medicine: రాయలసీమలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీని కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కరోనా బాధితుల బంధువులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కిలోమీటర్ల కొద్దీ లైన్లలో గంటల తరబడి నిలబడి మరీ ఈ ఉచిత కరోనా ఆయుర్వేద మందును తీసుకెళ్తున్నారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన డాక్టర్ ఆనందయ్య.. ఆయుర్వేదంతో ఓ మందు తయారుచేశాడు. కరోనాను నివారించేందుకు ఈ ఔషధం పనిచేస్తుందని చెబుతున్నాడు. కరోనా రాని వాళ్లు ఒకసారి, కరోనా బాధితులు మూడు డోసులు చొప్పున వేసుకుంటే వైరస్ ఇట్టే మాయమవుతుందని రమణయ్య అంటున్నాడు. ఇక.. ఈ విషయం తెలుసుకున్న జిల్లా, రాష్ట్ర ప్రజలు ఆయుర్వేద ఔషధం కోసం కృష్ణపట్నానికి పరుగులు తీస్తున్నారు.
ఇక.. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం వివరాలు సేకరించింది. తక్షణమే ఆయుర్వేద ఔషధ పంపిణీని నిలిపివేయాలని హెచ్చరించింది. అయితే.. ఔషధ పంపిణీ నిలిపివేయడంతో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఔషధ పంపిణీని కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చారు.