Atchannaidu: మాజీ మంత్రి, టీడీపీ సీనీయర్ నేత అచ్చెన్నాయుడు కరోనా నుండి కోలుకున్నారు. సోమవారం ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. ఈ రోజు కానీ రేపు (మంగళవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముంది. కాగా ఆగస్టు-13న అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్నకు రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందించారు.
ఈఎస్ఐ (ESI) మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జూన్-12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే.