రామతీర్ధంలో కొత్త విగ్రహాల ప్రతిష్టకు శరవేగంగా ఏర్పాట్లు
* ఈనెల28న విగ్రహ కళావాహనతో బాలాలయంలో స్వామి వారి పున: ప్రతిష్ట * ఆగమ శాస్త్రం ప్రకారం బాలాలయంలో మొదట ప్రతిష్ట
విజయనగరంలోని రామతీర్ధంలో కొత్త సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తిరుపతి శిల్పుల సహకారంతో విగ్రహాల తయారీ,తరలింపు కూడా పూర్తయ్యింది. ఈనెల 28న విగ్రహ కళావాహనతో బాలాలయంలో స్వామి వారి పున:ప్రతిష్ట జరిపి బాలాలయంలోనే మొదట విగ్రహాలను ప్రతిష్టిస్తారు విశ్వసేన పూజతో కార్యక్రమాలు మొదలవుతాయి.ఆగమ శాస్త్ర కళాశాల ప్రిన్సిపాల్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. విగ్రహాల ప్రతిష్టింప చేయడానికి 16 మంది శ్రీ వైష్ణవ రుత్వికులు ప్రత్యేకంగా దీక్షా వస్త్రాలు ధరించి దీక్ష పూనారు. అదే సమయంలో యాగశాలలో ఆరు హోమ గుండాలలో హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడురోజుల పాటూ శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం వైదక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.