APSET 2020: ఈరోజు నుంచి రెండు రోజుల పాటు ఏపీలో సెట్ పరీక్షలు!
APSET 2020 | ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు ఈరోజు నుంచి ఏపీలో సెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
APSET 2020 | ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు ఈరోజు నుంచి ఏపీలో సెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీలో జరిగే ఎంబీఏ, ఎంసీఏ, ఐసెట్ ఎంట్రన్స్ పరిక్షలు రాసేందుకు 64,884మంది విద్యార్థులు సిద్దమయ్యారు. మొత్తం రెండు రోజులు పాటూ జరగనున్న ఈ పరిక్షలకు ఏపీలో 74 కేంద్రాల్లో, తెలంగాణలో 1కేంద్రం ఏర్పాటు చేసారు అధికారులు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలనిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్షలు నిర్వహణ ఎగ్జామ్ ముందు, తర్వాత కూడా హాల్‌ను శానిటైజ్ చేసేలా చర్యలు.. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇసోలేషన్ రూమ్‌లు అందుబాటులో ఉంచారు అధికారులు. తొలిసారి విద్యార్థులకు హెల్ప్‌లైన్ సెంటర్, హాల్ టికెట్ తో పాటు పరీక్ష సెంటర్ రోడ్డు మ్యాప్ కూడా అందించిన అధికారులు పరీక్ష కేంద్రం వద్దకు గంట ముందుగానే రావాలని స్పష్టం చేసారు. అంతే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి థర్మల్ స్కానింగ్, చేసిన తరువాత మాస్క్ ధరించి రావాలని అధికారులు సూచించారు.