AP Three Capitals Bill: మూడు రాజధానులపై ప్రభుత్వం మాట నెగ్గించుకుంది. అనుకున్నట్టుగానే ఎన్నో ఇబ్బందుల మధ్య ఎట్టకేలకు ఈ సమావేశాల్లో బిల్లును ఆమోదింపజేసుకుంది. ఈ తరుణంలో ఇక పరిపాలనా వ్యవహారమంతా విశాఖ తరలి వెళ్లనుంది. చరిత్రాత్మక బిల్లులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. 'పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020', 'సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బి'లను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది.
అసెంబ్లీ అధికారులు ఈ రెండు బిల్లుల్ని గవర్నర్ ఆమోదం కోసం పంపారు. 'సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలిలో పెట్టి ఇప్పటి వరకు నెల రోజులు గడుస్తుండడంతో ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్లు గవర్నర్ దగ్గరకు చేరింది. నేడు శుక్రవారం ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఇకపై శాసన సభ రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం తెలిపారు.
ఈ పరిణామంతో రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయి. అయితే, మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని జూలై 31 (శుక్రవారం) మూడు రాజధానుల బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.