గడప గడపలో పోటు.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ..
Gadapa Gadapaku YSRCP: ప్రజల్లో ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయ్ ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజలు ఇంకా ఏదో ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు.
Gadapa Gadapaku YSRCP: ప్రజల్లో ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయ్ ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజలు ఇంకా ఏదో ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. గత ఎన్నికల్లో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ గద్దెనెక్కిన సీఎం జగన్ మరో రెండేళ్ల తర్వాత రానున్న ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. 2019లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ ఇప్పుడు ఇంటింటికీ మన ప్రభుత్వం నినాదంతో ముందుకెళ్తోంది. వైసీపీ పాలనను, ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారన్నదానిపై ఒక అంచనాకు రావడానికి కార్యక్రమం ఉపకరిస్తోందని జగన్ భావిస్తున్నారు. గడపగడపకు కార్యక్రమంతో అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష కానుందా అన్న చర్చ పార్టీలో విన్పిస్తోంది.
ఎన్నికల్లో గెలిచిన మూడేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు నేరుగా ప్రజల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. సంక్షేమ పాలన, నవరత్నాలతో జనం ఖుషీగా ఉన్నారా? అన్నదానిపై వైసీపీకి స్పష్టత రానుంది. ఇవాళ మొదలైన గడపగడప కార్యక్రమంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు జనం చుక్కలు చూపిస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తుండటంతో నేతలు ఠారెత్తిపోతున్నారు. కర్నూలులో మంత్రి జయరామ్‌ను స్థానికులు నిలదీశారు. హిందూపూర్‌లో ఎంపీ మాధవ, ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఉపాధిహామీ కూలీ రాలేదంటూ మంత్రి బుగ్గనకు మొరపెట్టుకున్నారు గ్రామస్తులు. మొత్తంగా వైసీపీ నేతలకు గడప గడపకు వైఎస్సార్ 2024 సెమీ ఫైనల్ అని అధికార పార్టీ భావిస్తోంది.