AP CS: కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయింది.. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు..
Sameer Sharma: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని అన్నారు ఏపీ సీఎస్ సమీర్‌శర్మ.
Sameer sharma: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని అన్నారు ఏపీ సీఎస్ సమీర్‌శర్మ. గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరన్న ఆయన థర్డ్‌వేవ్‌తో మరింత నష్టం వచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా లేకపోతే 98వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఒమిక్రాన్ కూడా రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని చెప్పారు. పీఆర్సీ ఆలస్యమవుతుందనే ఐఆర్ ఇచ్చామన్న సీఎస్ సమీర్‌శర్మ పీఆర్సీ వల్ల గ్రాస్ శాలరీ ఏమాత్రం తగ్గదన్నారు.