Job Calendar: జాబ్‌ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

Job Calendar: నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువు రావాలంటే కత్తిమీద సామే కోచింగ్‌లకు వెళ్లడం.

Update: 2021-06-18 15:00 GMT

Job Calendar: జాబ్‌ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్

Job Calendar: నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువు రావాలంటే కత్తిమీద సామే కోచింగ్‌లకు వెళ్లడం. పుస్తకాలతో కుస్తీలు పట్టడం. నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అనవాయితీగా వస్తోంది. ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందో అర్థంకాదు. ఇలాంటి కన్‌ఫ్యూజన్‌కు చెక్‌ పెడుతూ ఏపీ సీఎం జగన్‌ సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఉద్యోగ నియామకాల ఫుల్‌ డిటైల్స్‌ తో జాబ్‌ క్యాలెండర్‌‌ను రిలీజ్ చేశారు.

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భరోసాను ఇస్తోంది. శుక్రవారం సీఎం జగన్ జాబ్‌ క్యాలెండర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం 10 వేల 143 పోస్టులను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ముందే తేదీలతో వివరాలను జాబ్‌ క్యాలెండర్‌లో పొందుపరిచారు. నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల కోసం ఆతృతగా ఎదురుచూస్తారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి కోచింగ్‌లు తీసుకుంటారు. రోజు పుస్తకాలతోనే గడుపుతారు. అలాంటి వారు మనోధైర్యం కోల్పోకుండా ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ పూనుకున్నారు.

ఎలాంటి దళారులు, పైరవీలు, సిఫార్సులకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు సీఎం జగన్. ప్రభుత్వ నియామకాల్లో ఇంటర్వ్యూలకు ఏపీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. రాత పరీక్షల్లో మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం 2 ఏళ్ల కాలంలోనే 6లక్షల 3వేల 756 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గ్రామ సచివాలయాల్లో అలాగే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా భారీగా నియామకాలు జరిగాయి. వీటితోపాటు 1.84లక్షల శాశ్వత ఉద్యోగాలు, 3లక్షల 99వేల 7వందల 91 మందికి అవుట్‌ సోర్సింగ్‌పై 19వేల 701 మందికి కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించామని సీఎం వివరించారు.

అంతేకాకుండా 7లక్షల 2 వేల 6వందల 56 మంది ఉద్యోగుల వేతనాలను పెంచామన్నారు సీఎం జగన్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించామని జగన్‌ అన్నారు. ప్రతి నెల 1న ఆప్కాస్ ద్వారా వేతనాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై 3వేల 500 కోట్లు అదనపు భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. గ్రామాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు, 8 చోట్ల హార్బర్లు, 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని జగన్ అన్నారు. ఇలా చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జగన్ తెలిపారు.

Tags:    

Similar News