World Economic Forum: ప్రముఖులతో సీఎం జగన్ భేటీ
Jagan: పారిశ్రామిక పెట్టుబడులకు, ఆర్థిక ప్రగతి సాధనకు ఆంధ్రప్రదేశ్‌లో వనరులు సానుకూలంగా ఉన్నాయని సీఎం జగన్ ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించే ప్రయత్నం చేశారు.
Jagan: పారిశ్రామిక పెట్టుబడులకు, ఆర్థిక ప్రగతి సాధనకు ఆంధ్రప్రదేశ్‌లో వనరులు సానుకూలంగా ఉన్నాయని సీఎం జగన్ ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించే ప్రయత్నం చేశారు. దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన ఏపీ పెవీలియన్‌ను ప్రారంభించారు. దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనమిక్ ఫోరంల వ్యవస్థాపకులు క్లాజ్ స్వాప్‌తో జగన్ భేటీ అయ్యారు. వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యామ్ బిషేన్‌తో సమావేశమయ్యారు. మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి గొమేజ్‌తో సమావేశమై ఫ్లాట్ ఫామ్ పార్టనర్‌షిప్‌పై ఒప్పందం చేసుకున్నారు. బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్‌తో, మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య థాకరే, ఆదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతమ్ ఆదానీలను కలసి ఏపీలో పెట్టుబడులు, ఆర్థిక ప్రగతి సాధనలో సానుకూల అంశాలపై చర్చించారు.