Andhra Pradesh: ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. అలాగే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు కరోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై చర్చించనున్నారు. రోగులకు ఆక్సిజన్ సరఫరా, బెడ్స్, రెమిడిసివిర్ కొరత వంటి అంశాలపై చర్చించనుంది కేబినెట్. కరోనా కట్టడి చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండగా.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంపై కూడా దృష్టిసారించనుంది ఏపీ కేబినెట్.. కరోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై చర్చించనున్న సీఎం వైఎస్ జగన్.. ఆక్సిజన్, బెడ్లు, రెమిడెసివిర్ కొరత వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. వీటితో పాటు పలు కీలక ఎజెండాలపై చర్చంచనుంది కేబినెట్.
మరో ఎపీలో కరోనా కేసుల పెరిగిపోతున్నాయి. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 11 వేల 434 పాజిటివ్ కేసులు నమోదు కాగా 64 మంది మృతి చెందారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 8 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, చిత్తూరులో ఐదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్ఛిమగోదావరి జిల్లాల్లో నలుగురు మృతి చెందారు.