AP Cabinet Meeting: ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
AP Cabinet Meeting: ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్మను తొలగించాలని ఏపీ కేబినెట్ ఆదేశం
AP Cabinet: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎల్జీపాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. ఆ భూముల్లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో మైనార్టీ సబ్ ప్లాన్‌కు జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకంపైనా చట్ట సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ వినియోగానికి 10వేల మెగావాట్లను కేటాయించనున్న సర్కార్ యూనిట్‌కు రూ.2.49కు సరఫరా చేసేలా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే, R&Bకి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలు ఆర్టీసీకి బదలాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.