ఏపీ అసెంబ్లీ ఫస్ట్ సెషన్‎పై సర్వత్రా ఆసక్తి.. వైసీపీని చంద్రబాబు లైట్ తీసుకుంటారా? ఆటాడుకుంటారా?

AP Assembly Session: అద్భుతమైన విజయం నమోదు చేసిన ఊపుతో ఏపీ సర్కారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది.

Update: 2024-06-13 03:30 GMT

ఏపీ అసెంబ్లీ ఫస్ట్ సెషన్‎పై సర్వత్రా ఆసక్తి.. వైసీపీని చంద్రబాబు లైట్ తీసుకుంటారా? ఆటాడుకుంటారా?

AP Assembly Session: అద్భుతమైన విజయం నమోదు చేసిన ఊపుతో ఏపీ సర్కారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. అమరావతి అసెంబ్లీ సమావేశాల శుభారంభం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. మరి స్పీకర్ గా ఎవరుంటారు? ప్రోటెమ్ స్పీకర్ గా ఎవర్ని ఎంపిక చేసే అవకాశాలున్నాయి? అలాగే సభా వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబునాయుడి స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉంది?

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఖుషీ మీద ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభను సవ్యంగా నిర్వహించేందుకు వ్యూహం రూపొందిస్తున్నారు. అధికారం కోల్పోయి అయోమయంలో పడిపోయిన జగన్ అండ్ టీమ్ ను ఎలా ట్రీట్ చేయాలి? వారిని లైట్ తీసుకుంటే మంచిదా లేక వారి తప్పిదాలను మరింత ఎక్స్‎పోజ్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటే మంచిదా అనే అంశంపైనా బాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడెలాగూ ఏపీలో ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రతిపక్షం లేని లోటును ఏ విధంగా పూరిస్తే బాగుంటందని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 11 మందితో వైసీపీ, 8 మందితో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూటమిలో ఉండగా వైసీపీ ఒక్కటే అసలైన విపక్షంగా ఉంది. కానీ టెక్నికల్ గా వారిని ప్రతిపక్ష పార్టీగా గుర్తించే పరిస్థితి లేదు. దీంతో ఏపీలో అసలు ప్రతిపక్ష బాధ్యత ఎవరు తీసుకుంటారనే చర్చ నడుస్తోంది.

మరోవైపు కొత్త అసెంబ్లీకి స్పీకర్ గా ఎవరు వ్యవహరిస్తారనే అంశం మీద కూడా అమరావతిలో ఓ టాక్ నడుస్తోంది. ఉన్న సభ్యుల్లో సీనియారిటీతో పాటు సభా వ్యవహారాలపై పట్టు, ఆసక్తి ఉన్న సీనియర్ నాయకుణ్ని స్పీకర్ గా ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రఘురామ పేరు దాదాపుగా స్పీకర్ గా ఖరారైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రఘురామ కృష్ణంరాజు 2019లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఆ తరువాత వైసీపీకి దూరమయ్యారు. కోవిడ్ విజృంభించిన సమయంలో ఆయన్ని జగన్ సర్కారు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిందని లోక్ సభ స్పీకర్ అనుమతి కూడా తీసుకోకుండా టార్చర్ చేశారని రఘురామ ఆరోపించారు. ప్రభుత్వం మారిన క్రమంలో ఇప్పుడు అదే అంశాన్ని తిరగదోడుతూ మళ్లీ కంప్లయింట్ చేశారు. తాజా ఎన్నికల్లో ఆయన ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అయితే జగన్ తో రాజకీయ వైరం చాలా తీవ్రస్థాయిలో ఉన్న దృష్ట్యా రఘురామ కృష్ణంరాజును స్పీకర్ గా ఎంపిక చేసినట్టు వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.

ఇక సభా వ్యవహారాలకు ముందు ఎమ్మెల్యేలందరి చేతా ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం కోసం ప్రోటెమ్ స్పీకర్ గా ఓ సీనియర్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్టీలో సీనియర్లుగా ఉన్న అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. సభలో సీనియారిటీకి ప్రయారిటీ ఇస్తూ ప్రోటెమ్ స్పీకర్ ను ఎన్నుకుంటారు. ఆ విధంగా చూస్తే అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి వరుసగా సీనియర్లుగా ఉన్నారు. మరి ప్రోటెమ్ స్పీకర్, స్పీకర్ బాధ్యతలు ఎవర్ని వరిస్తాయి.. సభలో ఎలాంటి కార్యకలాపాలు కనిపిస్తాయి.. అనేది చూడాలి. 

Tags:    

Similar News