ఏపీ అటవీశాఖలో నిధుల వినియోగంపై హైకోర్టు సీరియస్
ఏపీ అటవీ శాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కేంద్రం నుంచి వచ్చిన కంపా నిధులు సక్రమంగా వినియోగించలేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు హైకోర్టులోప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.
ఏపీ అటవీ శాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కేంద్రం నుంచి వచ్చిన కంపా నిధులు సక్రమంగా వినియోగించలేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు హైకోర్టులోప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. నిధుల వినియోగంపై విచారణ చేపట్టిన హైకోర్టు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేనట్లయితే అధికారులు కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ శాఖకు కేంద్రం కేటాయించిన నిధులను రాష్ర్ట ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగంచిందో వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసుకునేందుకు నాలుగు వారాలు గడువు ఇచ్చింది కోర్టు. పిటిషనర్ తరపునన న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.