ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

Andhra Pradesh: దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో జల్లులు

Update: 2022-05-16 03:00 GMT

ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

Andhra Pradesh: నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులు , దానిని ఆనుకుని ఉండే ఆగ్నేయ బంగాళాఖాతానికి విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 2.1 కి.మీ , 5.8 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఉన్నది . ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉంటుందని దీని ఫలితంగా ఉత్తర కోస్తాలో సోమవారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. మంగళవారం తేలిక పాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

Full View


Tags:    

Similar News